: దసరాకు హైదరాబాదులో 120 కల్లు దుకాణాలు
దసరా పండుగ నుంచి హైదరాబాదు నగరంలో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు చెప్పారు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో 120 కల్లు దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. సొసైటీ ద్వారా కల్లు దుకాణాలు నడవనున్నాయని, కల్లు దుకాణాల వల్ల 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. కల్లులో కల్తీ జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర జిల్లాల్లో ఉన్న తాటిచెట్లను హైదరాబాదు సొసైటీలకు కేటాయిస్తామని, ప్రభుత్వం తరఫున తాటిచెట్ల పెంపకం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.