: విమానాల్లో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నారా... అయితే ముప్పుంది!


విమాన పైలట్లతోపాటు క్యాబిన్‌లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ కేన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. తాజా పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. సాధారణ ప్రజలతో పోలిస్తే విమానాల్లో ప్రయాణాలు చేసేవారిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది. దీని ప్రకారమే విమాన సిబ్బందికి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. విమానాల్లో ప్రయాణించే ప్రతి సారీ అత్యంత ఎత్తుకు వెళ్తుండడంతో అల్ట్రా వైలట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్ల బారిన వీరు పడుతుంటారు. దీని కారణంగా పైలట్లు, విమాన క్యాబిన్ క్రూ చర్మక్యాన్సర్ బారిన పడుతుంటారని అధ్యయనం తెలిపింది. గతంలో పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని బలపరిచాయి.

  • Loading...

More Telugu News