: టీడీపీనేతలు పవన్ కల్యాణ్ ఫోటో పెట్టి మొక్కుకోవాలి: రోజా
పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రజలకు తప్పుడు హామీలిచ్చి, వారిని మభ్యపెట్టారని నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, పార్టీలో నేతల సత్తాపై నమ్మకం లేక పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని మద్దతు కోరారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న టీడీపీ నేతలంతా పవన్ కల్యాణ్ ఫోటో పెట్టుకుని పూజలు చేయాలని ఆమె సూచించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు, అధికారం చేపట్టగానే ఊసరవెల్లిలా రంగులు మార్చారని ఆమె మండిపడ్డారు. ప్రజలు టీడీపీ నిజస్వరూపాన్ని గుర్తించే రోజులు ముందు ఉన్నాయని ఆమె తెలిపారు.