: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం...మత్స్యకారులకు హెచ్చరికలు
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.