: బీట్‌రూట్ రసం తాగుతోంటే.. రక్తపోటు దరిజేరదు
రోజువారి ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలతో పాటూ బీట్‌రూట్ లాంటి వాటిని అధికంగా తీసుకునే వారికి రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు గుండెజబ్బులు కూడా రావని.. లండన్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ అమృత ఆహ్లూవాలియా చెబుతున్నారు. రోజూ ఓ గ్లాసు బీట్‌రూట్ రసం తీసుకుంటే హైబీపీ నుంచి ఉపశమనం లభిస్తుందిట. 227 గ్రాముల బీట్‌రూట్ రసం తాగితే.. 10ఎంఎంహెచ్‌జీ బీపీ తగ్గుతుందని లెక్క తేల్చారు. బీపీ నియంత్రణకు అవసరమయ్యే నైట్రేట్ బీట్‌రూట్‌లో సమృద్ధిగా ఉంటుందిట. మొత్తానికి పరిశోధనలు లండన్‌లో జరిగినా సరే.. కూరగాయలు, శాకాహారంలోనే అధికంగా ఆరోగ్యసూత్రాలు ఉన్నాయని నిగ్గుతేల్చారు.