: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా మేళ్లచెరువులో ఆయన పాల్గొన్న కార్యక్రమంలో వేదిక కుప్పకూలింది. అయితే, కార్యక్రమం జరిగిన కాసేపటికి వేదిక కుప్పకూలడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలకి గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.