: ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటి?: యనమల


ఆంధ్రప్రదేశ్ రాజధానికి దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరు పెడతామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఎన్టీఆర్ పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అయితే, రాజధాని నిర్మాణం తర్వాత ఎన్టీఆర్ పేరు ఖరారు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. రాజధాని భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే కృష్ణాజిల్లా మంత్రులు పని ప్రారంభించారన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా కొన్ని కేంద్రం చూస్తే, మరికొన్నిటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని వెల్లడించారు. జిల్లాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించామన్న యనమల పాలన కేంద్రీకృతమవుతుందని పేర్కొన్నారు. ఇక చీఫ్ జస్టిస్ ను సంప్రదించిన తర్వాతే హైకోర్టు ఎక్కడో ప్రకటిస్తామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News