: మోడీపై రాహుల్ సెటైర్లు
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో సమస్యలను గాలికి వదిలేసి, ప్రధాని జపాన్ లో డ్రమ్స్ వాయించుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నీరు, విద్యుత్, ధరలు వంటి సమస్యలు తీవ్రమవుతుంటే, ప్రధాని విహారయాత్రకు వెళ్ళారని విమర్శించారు. రాహుల్ తన నియోజకవర్గం అమేధీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ సర్కారు ఇచ్చిన హామీలను మరచిపోయిందని దుయ్యబట్టారు. మోడీ పాలనకు వంద రోజులు పూర్తయ్యాయని, ఫలితం ఏదని ఆయన ప్రశ్నించారు.