: స్కూలు కెళ్లాలంటే అస్సలు నచ్చేది కాదు: కరీనా కపూర్


తనకు స్కూలుకెళ్లాలంటే అస్సలు నచ్చేది కాదని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తెలిపింది. ఢిల్లీలో జరిగిన చైల్డ్ ఫ్రెండ్లీ పాఠశాలల విధానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్కూల్ లో తాను సగటు విద్యార్థినని చెప్పింది. ఫస్ట్ బెంచ్ విద్యార్థిని కాకపోవడం వల్ల టీచర్లు తనను పట్టించుకునేవారు కాదని కరీనా తెలిపింది. తనను స్కూలుకు పంపేందుకు తన తల్లి చాలా కష్టపడేదని కరీనా వెల్లడించింది. 33 ఏళ్ల కరీనా యునిసెఫ్ ఇండియా తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News