: మోడీ వంద రోజుల పాలన చాలా బాగుంది: వెంకయ్యనాయుడు
నరేంద్ర మోడీ భారత ప్రధాని పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. వంద రోజుల్లోనే మోడీ మార్కు పాలన చూపించామని, మోడీ వంద రోజుల పాలన చాలా బాగుందని ఆయన అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయాధికారాన్ని రాష్ట్రానికే వదిలేశామని, విజయవాడను రాజధానిగా చేశారని తెలిసిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి కావాలసిన అన్ని వసతులు కల్పిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.