: మలివిడత కౌన్సెలింగ్ పై రేపు ఉన్నత విద్యామండలి పిటిషన్
మలివిడత ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఉన్నతవిద్యామండలి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు సమాలోచనలు జరిపిన విద్యామండలి అధికారులు కౌన్సెలింగ్ పై పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్ అవసరం లేదన్న తెలంగాణ లేఖను కోర్టుకు సమర్పించనున్నారు. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే సెప్టెంబర్ మూడో వారంలో కౌన్సెలింగ్ కు ఏర్పాట్లు చేస్తారు.