: ఏపీ శాసనసభ రేపటికి వాయిదా


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సభ్యులు రాజధాని నిర్మాణానికి సంబంధించి చేసిన సూచనలు తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన పదకొండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరారు. వెంటనే తీర్మానాలను సభ ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ కోడెల శివప్రసాదరావు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News