: కాశ్మీర్లో ఘోరం... వాగులో పడిపోయిన పెళ్ళి బస్సు
జమ్మూకాశ్మీర్లో ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్ళి బృందాన్ని తీసుకువెళుతున్న ఓ బస్సు పొంగిపొర్లుతున్న వాగులో పడిపోయింది. బస్సులో 50 మంది ఉన్నట్టు సమాచారం. ఘటనలో ఆరుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారు దుర్మరణం పాలై ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన రాజౌరీ జిల్లాలో ఈ మధ్యాహ్నం జరిగింది. సహాయక చర్యలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను పంపామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, అక్కడి నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.