: ఆ గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలంటూ రేణుకా చౌదరి రాస్తారోకో


రాష్ట్ర పునర్విభజన ముసాయిదాపై ఇంతవరకూ నోరెత్తని ఎంపీ రేణుకా చౌదరి తొలిసారి నిరసన గళం వినిపించారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో... ఆమె కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడుకునేందుకు, పార్టీని పటిష్ఠం చేసేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తున్నారు. పునర్విభజన ముసాయిదాలో ఉన్న పోలవరం గురించి మాట్లాడని ఆమె, ఆంధ్రప్రదేశ్ లో కలిపిన భద్రాచలం మండలంలోని మూడు పంచాయతీలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఖమ్మం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించిన ఆమె, భధ్రాచలం మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను తెలంగాణలోనే ఉంచాలని కోరారు. ఏపీకి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News