: ఏపీ రాజధానిపై అసెంబ్లీలో ఎనిమిది తీర్మానాలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై అసెంబ్లీలో నేడు ఎనిమిది తీర్మానాలు చేశారు. వాటిని వరుస ప్రకారం చూస్తే... * హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేసిన తీరుపై శాసనసభ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్మానం * ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తీర్మానం * రాజధానిగా విజయవాడ అభివృద్ధికి కేంద్ర సంపూర్ణ సహకారం కోరుతూ తీర్మానం * రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన ప్రతిపాదనలు, హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ తీర్మానం * అన్ని విధాలా ఏపీకి సమన్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం * రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం ఆర్థిక, విధానపరమైన మద్దతు అందించాలని తీర్మానం * నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం * శాసనమండలి సీట్ల కేటాయింపులో అన్యాయాన్ని సవరించి 58 సీట్లకు పెంచాలని తీర్మానం

  • Loading...

More Telugu News