: క్రీడల్లో విజేత... మృత్యువు చేతిలో ఓడిపోయింది!


ఆ అమ్మాయి క్రీడల్లో ఎన్నో పతకాలు, సర్టిఫికెట్లు అందుకుంది. చదువులోనూ మేటిగా నిలిచింది. కాలం కసిగా కాటేస్తే, ఎంతటివారైనా ఏం చేయగలరు? ఈ వర్ధమాన క్రీడాకారిణి కూడా అలానే బలయిపోయింది. విషాదకరంగా ఓ రోడ్డు ప్రమాదంలో అసువులుబాసింది. ఢిల్లీలో నివసించే దీప్తి (18) అనే అమ్మాయి కబడ్డీ, షాట్ పుట్, త్రోబాల్, ట్రాక్ ఈవెంట్స్ లో విశేష ప్రతిభ కనబర్చేది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో 40 దాకా బహుమతులు అందుకుంది. సోమవారం నాడు కాలేజీ వద్ద రోడ్డు దాటుతుండగా, ఓ కారు వేగంగా వచ్చి దీప్తిని ఢీకొట్టింది. ఆగకుండా వెళ్ళిపోయిందా కారు. అక్కడి వారు తీవ్రగాయాలపాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్టు ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వర్గాలు ప్రకటించాయి. కాగా, దీప్తి మృతికి కారణమైన నళిని అగర్వాల్ అనే మహిళ పోలీసులకు లొంగిపోయింది. అనంతరం ఆమెకు బెయిల్ లభించింది.

  • Loading...

More Telugu News