: ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లకు త్వరలో 24 గంటల విద్యుత్: కేంద్ర మంత్రి


ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు త్వరలో 24 గంటల విద్యుత్ సప్లయ్ చేయనున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయిన కేటాయింపులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే, ఏ తేదీ నుంచి అమలు చేయనున్నారో మాత్రం మంత్రి తెలపలేదు. కాగా, విద్యుత్ రంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరామని, వారు ఇంతవరకు స్పందించలేదని పియూష్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News