: సభ పున:ప్రారంభం... విజయవాడను రాజధానిగా స్వాగతించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడోసారి వాయిదా అనంతరం మళ్లీ ప్రారంభమైంది. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను విరమించడంతో రాజధాని ఏర్పాటుపై ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ నడుస్తోంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షనాయకుడు జగన్ విజయవాడను రాజధానిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించనప్పటికీ... విద్వేషాలు రెచ్చగొట్టకూడదనే ఉద్దేశంతో తాము ఈ ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. రాజధానిపై చర్చ జరగాలనే తప్ప... తమకు వేరే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.