: ఏపీ సర్కార్ వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీలు, పరిశ్రమల వివరాలు
రాజధాని ప్రకటన కాపీలను అసెంబ్లీ అధికారులు శాసనసభ్యులందరికీ అందజేశారు. ఈ ప్రకటనలో విజయవాడ ప్రాంతంలో నూతన రాజధానిని ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో 3 మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు ఏర్పాటుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు, అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. 13 జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, ఇండస్ట్రీలను ప్రభుత్వం ఈ ప్రకటనలో పేర్కొంది. ఆ వివరాలు ఇవి.. * శ్రీకాకుళం జిల్లాలో ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ పార్క్ * విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజి * విశాఖలో ఐటీ హబ్, ఫుడ్ పార్క్, రైల్వేజోన్ * తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ * పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఐటీ, ఉద్యానవన పరిశోధన కేంద్రం * గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ యూనివర్సిటీ, ఎయిమ్స్ * ప్రకాశం జిల్లాలో మైన్స్ అండ్ మినరల్స్ యూనివర్సిటీ * నెల్లూరు జిల్లాలో ఆటోమొబైల్ హబ్, ఎరువుల కర్మాగారం * కడపలో స్టీల్ ప్లాంట్, ఉర్దూ యూనివర్సిటీ, సోలార్, విండ్ పవర్ ప్లాంట్ లు * కర్నూలు జిల్లాలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఐఐటీ, స్విమ్స్ తరహా ఆసుపత్రి * అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం