: నిఠారీ హత్యల కేసుల్లో దోషి సురిందర్ కోలీపై డెత్ వారెంట్
నిఠారీ వరుస హత్యల కేసులో దోషిగా నిర్ధారణ అయిన సురీందర్ కోలీపై ఘజియాబాద్ సెషన్స్ కోర్టు మరణశిక్ష వారెంట్ జారీ చేసింది. 2005లో పద్నాలుగేళ్ల రింపా హల్దర్ ను కిరాతకంగా హత్య చేసిన కేసులో కోర్టు ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. అతనిని ఉరితీసేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయాలంటూ ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆ వారెంట్ ను పంపనున్నారు. జులై 27న కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ నెల 12న కోలీని ఉరితీసేందుకు కోర్టు తేదీని ఖరారు చేసిందని... అయితే, మరణశిక్ష అమలు తేదీపై యూపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయవర్గాలంటున్నాయి.