: అల్ ఖైదా ప్రకటన నేపథ్యంలో రాష్ట్రాలకు ఐబీ హెచ్చరిక
భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు అల్ ఖైదా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. అల్ ఖైదా వీడియో విడుదల చేసిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ దీనిపై నివేదిక ఇవ్వాలంటూ ఐబీని కోరింది. రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం కూడా హెచ్చరించింది.