: వైసీపీ సభ్యుల రభసతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడోసారి వాయిదా
వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్రకటించారు. రాజధాని ప్రకటన చేశాక... ఈ విషయంపై చర్చకు తాము సిద్ధమని బాబు స్పష్టం చేశారు. అయితే, వైసీపీ సభ్యులు 'చంద్రబాబు డౌన్ డౌన్'... 'వియ్ వాంట్ జస్టిస్' అంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గందరగోళం చేయడంతో సభను మూడోసారి 15 నిమిషాల పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వాయిదా వేశారు.