: ఏపీ రాజధాని నిర్మాణానికి కృష్ణా, విశాఖ డెయిరీల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కృష్ణా, విశాఖకు చెందిన డెయిరీల యాజమాన్యాలు విరాళం అందించాయి. ఈ మేరకు కృష్ణా డెయిరీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య, విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావులు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి రూ.7 కోట్ల విరాళం అందజేశారు. అటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైతు బజార్ కు చెందిన డ్వాక్రా మహిళలు విరాళం ఇచ్చారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ను కలసి రూ.30వేలు అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ చిత్రపటాన్ని మహిళలు ఆయనకు బహకరించారు.