: విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే రాజధాని: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
ఆంధప్రదేశ్ నూతన రాజధానిపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు సభకు తెలిపారు. అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందనే, విజయవాడను రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ గురించి ఉపసంఘం ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.