: వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసనసభ రెండోసారి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ రోజు రెండోసారి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు రాజధానిపై చర్చ చేపట్టాలంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రెండోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.