: జగన్ సభలో అల్లరి చిల్లరి పిల్లాడిలా ప్రవర్తిసున్నారు: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
వైసీపీ సభ్యులు సభాహక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించడం దారుణమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే సభ నడుస్తుందని... జగన్ ఎస్టేట్ లో నిర్వహించే కార్యక్రమాల్లాగా శాసససభ కార్యక్రమాలు జరగవని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ సభలో అల్లరి చిల్లరి పిల్లాడిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే సభలో అడుగుపెట్టే అర్హత కోల్పోతారని ఆయన హెచ్చరించారు. జగన్ అనుభవరాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్నాడని... ఆయనకు సరైన సలహాలు ఇచ్చి దారిలోకి తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు గోరంట్ల సూచించారు.