: యనమల 'జగనోక్రసీ' వ్యాఖ్యలపై సభలో వైసీపీ సభ్యుల ఆందోళన


శాసనసభలో మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన 'జగనోక్రసీ' వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే జోతుల నెహ్రు పేర్కొన్నారు. వెంటనే జగన్ కు అధికార పక్ష సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రజల మద్దతుతో ఎన్నికైన సభ్యులమని... అంతేకానీ, దొడ్డిదారిలో మంత్రిపదవులు పొందినవారం కాదని ఆయన యనమలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News