: నేడు సచిన్ తో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశం


ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోని అబాట్ గురువారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో సమావేశం కానున్నారు. భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మొదటగా సచిన్ తో భేటీ కావడం విశేషం. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఓ కార్యక్రమంలో అబాట్ తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అడమ్ గ్రిల్ క్రిస్ట్, బ్రెట్ లీ సచిన్ ను కలుస్తారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య కుదరిన ఓ క్రీడా అవగాహన ఒప్పందంపై అబాట్ సంతకం చేయనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News