: స్నేక్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు చేసిన 'కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్' అంటే...


నిన్న పహాడీ షరీఫ్ లో స్నేక్ గ్యాంగ్ ను పట్టుకోోవడానికి... మొన్నామధ్య ఆల్వాల్ లో ట్రెర్రరిస్ట్ లింకులు ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి హైదరాబాద్ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ హైదరాబాద్ పోలీసులకి కూడా కొత్తే! కానీ అంతర్జాతీయ పోలీసింగ్ వ్యవస్థలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ బాగా పాప్యులర్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ను విదేశాల్లో ఎక్కువగా చేస్తారు. కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎంచుకున్న నిర్దేశిత ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా దిగ్బంధనం చేస్తారు. ఏ ప్రాంతంలో నిందితులు ఉన్నారని అనుమానిస్తారో... ఆ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ సహాయంతో పోలీసులు పూర్తిగా ట్రాక్ చేస్తారు. ఆ ప్రాంతంలో ప్రతీ మేజర్ రూట్ తో పాటు ప్రతీ చిన్న గల్లీని పోలీసులు నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా భారీ బలగంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముడతారు. ఈ క్రమంలోనే మనుషులు గానీ హహనాలు గానీ నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లకుండా... ఆ ఏరియాను మిగతా ఏరియాలకు కనెక్ట్ చేసే మేజర్ రోడ్లపై కిొంతమంది పోలీసులు కాపలాగా ఉంటే.... ఇంకొంతమంది ఆ ఏరియాలోని ప్రతీ ఇంటినీ సెర్చ్ చేస్తారు. దీని వల్ల నిందితులు తప్పించుకునే అవకాశం ఉండదు. వరల్డ్ క్లాస్ పోలీసింగ్ లో భాగంగా ఆగస్ట్ నెల నుంచి హైదరాబాద్ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు మొత్తం ఐదు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆగస్ట్ ఆరంభంలో బాలానగర్ జోన్ లో మొదటి ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత శంషాబాద్ జోన్ లో ఓ సారి...ఆల్వాల్ ప్రాంతంలో మరోసారి ఈ ఆపరేషన్ నిర్వహించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ తో పాటు ఇంటర్నేషనల్ పోలీసింగ్ లో 'కార్డాన్ అండ్ కిక్'... 'కార్డాన్ అండ్ నాక్' ఆపరేషన్స్ కూడా చాలా పాప్యులర్ ఆపరేషన్స్.

  • Loading...

More Telugu News