: 37 మంది డీఎస్పీలకు పదోన్నతి
తెలంగాణ రాష్ట్రలో 37 మంది డీఎస్పీలకు పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న 37 మంది సీనియర్ డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసు శాఖలో పదోన్నతులు మరిన్ని జరుగనున్నాయి. వీరి స్థానాల్లో డీఎస్పీలుగా పలువురికి పదోన్నతి లభించే అవకాశం ఉంది.