: ఏపీకిచ్చిన వాగ్థానాల సంగతేంటి? : జైరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్థానాలను కేంద్రం నెరవేర్చలేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. డిల్లీలో ఆయన మాట్లాడుతూ, మూడు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. పోలవరం అథారిటీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఆయన తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంకా పన్నురాయితీ వర్తింపజేయాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన వారిలో జైరాంరమేష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.