: కేరళ గవర్నర్ గా జస్టిస్ సదాశివం


కేరళ గవర్నరుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. కేరళ గవర్నరుగా షీలాదీక్షిత్ రాజీనామా చేయడంతో సదాశివంను గవర్నరుగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఆయన నియామకంపై ఊహాగానాలు వస్తున్నప్పటి నుంచీ ఈ విషయం రాజకీయ, న్యాయ రంగాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. గతంలో ఎన్నడూ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి గవర్నర్ పదవి చేపట్టలేదని మరో ప్రధాన న్యాయమూర్తి వీఎస్ ఖరే వ్యాఖ్యానించారు. అదే అవకాశం తనకు వచ్చి ఉంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించేవాడినని ఆయన తెలిపారు. ఇలాంటి నియామకాల వల్ల న్యాయవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News