: మా ఎంపీకి పెళ్ళి చేయాలనుకుంటున్నాం: అచ్చెన్నాయుడి సరదా వ్యాఖ్య
సమావేశాలు సాగినన్నాళ్ళూ అసెంబ్లీ లాబీల్లో రోజూ ఏదో ఒక సరదా సంఘటన జరగడం మీడియాలో చూస్తున్నాం. తాజాగా, మంత్రి అచ్చెన్నాయుడు తన సోదరుడి కుమారుడు, ఎంపీ కింజెరాపు రామ్మోహన్ నాయుడికి పెళ్ళి చేయాలనుకుంటున్నామని, ఏదైనా సంబంధం ఉంటే చెబుదురూ... అంటూ తోటి టీడీపీ నేతలను కోరారు. పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ళ నరేంద్ర, వల్లభనేని వంశీ, వేం నరేందర్ రెడ్డి అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఈ ప్రస్తావన వచ్చింది. వారు రాజధాని అంశంపై మాట్లాడుకుంటూ ఉండగా, వ్యవహారం మధ్యలో పెళ్ళి అంశం పైకి మళ్ళింది. అప్పుడు అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్య చేశారు. దీనికి మిగతావారు ఏం బదులిచ్చారో తెలియరాలేదు.