: ఏపీలో రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై ఫిర్యాదుల స్వీకరణకు కమిటీ


ఆంధ్రప్రదేశ్ లో రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్ గా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఉండనున్నారు. కన్వీనర్ గా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ చంద్ర పుత్ర ఉంటారు. ఇక సభ్యుల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఎస్ఎల్ బీసీ కన్వీనర్ ఉన్నారు. అంతేగాక జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News