: ఎనర్జీ డ్రింకులతో జర జాగ్రత్త..!


క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింకులను తాగడం సర్వసాధారణం. నేటి యువతలోనూ ఎనర్జీ డ్రింకులపై మోజు విపరీతంగా పెరిగిపోయింది. డ్యాన్స్ క్లబ్బుల్లోనూ, జిమ్ముల్లోనూ ఇవి విరివిగా దర్శనమిస్తున్నాయి. అయితే, వీటి కారణంగా హృదయ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఫ్రాన్స్ కు చెందిన ప్రొఫెసర్ మిలో డానియెల్ డ్రిసి అంటున్నారు. వీటిలో 96 శాతం డ్రింకులు విషపదార్ధమైన కెఫీన్ ను కలిగి ఉన్నాయని, కెఫీన్ రక్తంలో అధిక మొత్తంలో కాల్షియం విడుదలకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. తద్వారా, గుండె ఆక్సిజన్ ను వినియోగించుకునే సామర్థ్యం సన్నగిల్లుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News