: ఇంగ్లండ్ 'ప్రపంచకప్' బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే : బోదమ్


టెస్టుల్లో భారత ఆటగాళ్లను ఇండియా వెటరన్ క్రికెటర్లు తూర్పారబడితే, వన్డేల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఆ దేశ వెటరన్ లు మండిపడుతున్నారు. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ బోధమ్ ఇంగ్లండ్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచకప్ కు ఆరు నెలల ముందు వన్డేల్లో ఇంత దారుణమైన ప్రదర్శనా? అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాగే ఆడితే ఇంగ్లండ్ జట్టు 'ప్రపంచకప్'కు బదులుగా 'ఎగ్ కప్' గెలుచుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లండ్ గుణపాఠాలు నేర్చుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ చేస్తూ ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోందని ఆయన విమర్శించారు. ఆటతీరు మార్చుకోవాలని ఆయన ఇంగ్లండ్ ఆటగాళ్లను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News