: విజయవాడలో వినాయకుడి నిమజ్జనాలు రేపటికి వాయిదా
కృష్ణానదిలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. నిమజ్జనాలు రేపటికి వాయిదా వేసుకోవాలని విజయవాడ నగర కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం తగ్గినందున విగ్రహాల నిమజ్జనానికి ఆటంకం ఏర్పడిందని సీపీ చెప్పారు. రేపటికల్లా పులిచింతల ప్రాజెక్టు నుంచి నీరు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.