: సమావేశమైన మహిళల భద్రత - రక్షణ కమిటీ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళల భద్రత - రక్షణ కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశమైంది. ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, శైలజా రామయ్యార్, ఐపీఎస్ అధికారులు సౌమ్య మిశ్రా, చారు సిన్హా, స్వాతి లక్రా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పూనం మాలకొండయ్య మాట్లాడుతూ... ఆఫీసుల్లో పనిచేసే మహిళల భద్రతపై చర్చించామని చెప్పారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోకుండా ప్రతిపాదనలు రూపొందించి, 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు ఆమె తెలిపారు.