: మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠకు తెర
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెర పడింది. డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేసిన కంతేటి సత్యనారాయణరాజు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ వేసిన గంటలోపే కంతేటి విత్ డ్రా చేసుకున్నారు. టీడీపీ నుంచి మండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. తొలుత మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి చైతన్యరాజు పేరును ఖరారు చేశారు. అయితే, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు పేరును వ్యతిరేకించడంతో సతీష్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. మరికాసేపట్లో సతీష్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతునిస్తుందని ఆయన చెప్పారు. తన ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తోడ్పడిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా సతీష్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమే. రేపు మండలి ఛైర్మన్ చక్రపాణి డిప్యూటీ ఛైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.