: ఉపాధ్యాయుల పిల్లలే ప్రభుత్వ స్కూళ్లలో చదవడం లేదు: మంత్రి గంటా
‘నేను అందరి మంత్రుల్లా కాదు, పనితీరులో నా మార్క్ చూపిస్తా’నని చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఉపాధ్యాయుల పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం లేదని, అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే విద్యా కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. తమిళనాడు, కేరళలో విద్యావిధానంపై అధ్యయనానికి కమిటీని వేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. నైతికత అనే అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు పనిచేస్తే ప్రోత్సాహం అందిస్తామని, పనిచేయకుంటే పనిష్మెంట్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటే యూనియన్లు అడ్డు రావొద్దని మంత్రి సూచించారు.