: ఉత్కంఠగా మారిన ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇంతకు మునుపు చైతన్యరాజు పేరును టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేయగా, ఆయన నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలా వుండగా, ఇప్పుడు కొత్తగా సతీష్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా సతీష్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతును కూడగట్టే యత్నంలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో చివరి క్షణంలో నన్నపనేని రాజకుమారి పేరు తెర పైకి వచ్చింది. దీంతో మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు తీవ్ర పోటీ నెలకొంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు 13 మంది ఉండగా, టీడీపీకి 8 మంది సభ్యులున్నారు. సీపీఐకి ఒకరు, వైఎస్సార్సీపీకి ఒకరు, ఇండిపెండెంట్లు 12 మంది ఉన్నారు. గవర్నరు కోటాలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. మండలిలో మొత్తం 50 మంది సభ్యులున్నారు.