: టోక్యోలో నేతాజీ సహచరుడిని కలసిన మోడీ


నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహచరుల్లో ఒకరైన సయిచిరో మిసుమీని ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనలో కలిశారు. ఈ మేరకు ఇండో-జపాన్ సంఘం టోక్యోలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ లీగ్ కార్యక్రమంలో ఈ కలయిక చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మోడీ ఆయన వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి నేతాజీ గురించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, మిసుమీని ఇంటర్వ్యూ చేసి ఆ జ్ఞాపకాలను వీడియో రూపంలో భద్రపరచాలని జపాన్ లోని భారత రాయబారి దీపా వాద్వాకు చెప్పారు. మిసుమీ వయసు ఇప్పుడు 93 సంవత్సరాలు.

  • Loading...

More Telugu News