: రోజా వల్లే ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నా: తమిళ దర్శకుడు కలైంజియం


తమిళ దర్శకుడు కలైంజియం ఇటీవల రాజమండ్రిలో ఓ మిత్రుడి పెళ్లికి హాజరై తిరిగి వెళుతుండగా ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు. చెన్నైకి తిరుగుప్రయాణంలో ఆయన కారుటైర్ బద్దలవడంతో... తీవ్రగాయాలపాలై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఇటీవలే ఆయన కోలుకున్నారు. దీనిపై మాట్లాడుతూ, నటి రోజా వల్ల తాను ఈ రోజు ప్రాణాలతో మిగిలి ఉన్నానని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు తనను అంతగా సౌకర్యాలు లేని ఓ ఆసుపత్రిలో చేర్పించారని అన్నారు. ఆ తర్వాత రోజా ఫోన్ కాల్ తో పోలీసులు వెంటనే ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన ట్రీట్ మెంట్ ఇప్పించారని ఆయన పేర్కొన్నారు. కేవలం రోజా చేసిన మాటసాయం, ఆర్థిక సాయం వల్లే తాను ఈరోజు బ్రతికి బట్టకట్టగలిగానని కలైంజియం అన్నారు. రోజాకు, ఆమె భర్త సెల్వమణికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. హీరోయిన్ అంజలి వివాదంతో ఇటీవలే కలైంజియం వార్తల్లోకెక్కారు.

  • Loading...

More Telugu News