: యుద్ధం వస్తే భారతీయ ముస్లింలు పాక్ కే మద్దతు ఇస్తారని నేను వ్యాఖ్యానించలేదు: అసదుద్దీన్


భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే భారతీయ ముస్లింలు పాక్ కే మద్దతు పలుకుతారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నట్లుగా 'కాశ్మీర్ అబ్జర్వర్' వైబ్ సైట్ లో ఓ ఆర్టికల్ పోస్ట్ అయ్యింది. దీనిపై ఒవైసీ వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అవాస్తవమని... తాను అలాంటి కామెంట్లు చేయలేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కావాలనే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సదరు వెబ్ సైట్ పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. పాకిస్తాన్ అంటే అభిమానమున్న ముస్లింలు దేశవిభజన సమయంలోనే ఆ దేశానికి వెళ్లిపోయారని... తమ కుటుంబాలు దేశభక్తి కారణంగా ఇక్కడే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News