: గందరగోళం నడుమ ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
తీవ్ర గందరగోళం నడుమ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఏపీ రాజధాని అంశంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబడుతుండటంతో సభ సజావుగా కొనసాగేందుకు వీలుపడలేదు. అప్పటికే స్పీకర్, అధికార సభ్యులు ఎంత చెప్పినా విపక్ష సభ్యులు వినలేదు. దాంతో, చేసేదిలేక స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.