: మోడీకి జశోదాబెన్ కితాబు
మోడీ వంద రోజుల పాలనపై అత్యధికుల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, మోడీ కుటుంబ సభ్యులు సంతృప్తికరంగా ఫీలవుతున్నారు. మోడీ నుంచి విడవడి వేరుగా ఉంటున్న జశోదాబెన్ దీనిపై స్పందిస్తూ... గుజరాత్ ను అభివృద్ధి చేసినట్టే యావత్ దేశాన్ని పురోగామి పథంలో నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. మోడీ సర్కారు సరైన దారిలోనే పయనిస్తోందంటూ ఆమె కితాబిచ్చారు. ఇక, మోడీ సోదరుల్లో ఒకరైన ప్రహ్లాద్ మాట్లాడుతూ, "మోడీ భారతదేశాన్ని తన కుటుంబంగా దత్తత తీసుకున్నారు. అతనిప్పుడు మా వాడు కాదు, దేశానికి చెందిన వాడు" అని పేర్కొన్నారు. సోదరి బసంతిబెన్ అయితే మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ అన్ని హామీలను నెరవేరుస్తారని తెలిపారు. ఎప్పుడు మోడీ ప్రసంగం విన్నా, అతడో ప్రధానమంత్రి అని గర్విస్తానని అన్నారు.