: వైసీపీ సభ్యులు సభలో 'కుక్కతోక వంకర' లాగా ప్రవర్తిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
'కుక్కతోక వంకర'లాగా... వైసీపీ సభ్యులు మూడు రోజులపాటు శాసనసభలో సవ్యంగానే వ్యవహరించి, మళ్లీ మొదటికొచ్చారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రతిపక్షనాయుడు జగన్ అసెంబ్లీని తన ఇష్టప్రకారం నడపాలనుకుంటున్నారని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాలు, నియమాలపై ఎవరైనా నిపుణుడితో జగన్ అర్జెంటుగా శిక్షణ తీసుకోవాలని గోరంట్ల సలహా ఇచ్చారు. జగన్ కు దోచుకోవడంలో ఉన్న విజన్... అసెంబ్లీ పద్ధతులు, నియమాలు తెలుసుకోవడంపై లేదని ఎద్దేవా చేశారు.