: కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి
రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలు కోర్టులో లొంగిపోయారు. నందికొట్కూరు జడ్పీ ఛైర్ పర్సన్ సాయి ఈశ్వర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో నాలుగు నెలల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి, ఆయన కుమార్తె డాక్టర్ శబరి పార్టీకి బాధ్యత వహిస్తున్నారు.