: శ్రీవారిని దర్శించుకున్న ఆర్థిక మంత్రి యనమల


తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మంత్రికి స్వాగతం పలికారు. అటు, గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కుటుంబం కూడా శ్రీవారిని దర్శించుకుంది.

  • Loading...

More Telugu News