: 'స్నేక్ గ్యాంగ్' కోసం ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో భారీ సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ పహడీషరీఫ్ పీఎస్ పరిధిలోని షాహిన్ నగర్, ఎర్రగుంటలలో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలనుంచి సైబరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ నాయకత్వంలో సుమారు 420 మంది పోలీసులు ఈ ప్రాంత్రాల్లోని ప్రతీ ఇంటిని జల్లెడ పట్టారు. పాములతో బెదరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడే స్నేక్ గ్యాంగ్ నివసించే ఈ ప్రాంతాల్లో పోలీసులు ఓ పథకం ప్రకారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు ఎనిమిది మంది రౌడీషీటర్లు, 11మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 బైక్ లు, 3వ్యాన్ లు, 2కార్లను... 2 గుర్రాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అదే విధంగా స్నేక్ గ్యాంగ్ లో ఎ-1 నిందితుడు ఫైజల్ దయానికి చెందిన స్కార్పియో, రెండు బైక్ లును కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో పైసల్ దయానీ సోదరులను... అతనికి సహకరించిన మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.